CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రగతి, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద అంశం తెరపైకి వచ్చి సర్కార్‌ను అతలాకుతలం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగిపోవడం, ప్రజల దృ ష్టిని మళ్లించేందుకు పరుష భాషను ప్ర యోగించడం, లేదంటే దృష్టి మళ్లింపు చ ర్యలకు అవసరమైన ఆసక్తికరమైన అం శాన్ని ఎంపిక చేసుకోవడమే పాలనగా భా విస్తున్నారా? అంటే రాష్ట్రంలో జరుగుతు న్న వరుస పరిణామాలు అవుననే అంటున్నాయి. అసంపూర్ణ రుణమాఫీపై రైతు లు ఊరూరా రణగీతం ఆలపిస్తున్నారు. ఆ వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మ ళ్లించే ఎత్తుగడలో భాగంగా ఇతర అంశాలను ఉద్దేశపూర్వకంగానే తెరమీదికి తె స్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
గత డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కా ర్ కొలువుదీరినప్పటి నుంచి తాజాగా శనివారం ‘ఎన్’ కన్వెషన్ కూల్చివేతల దాకా సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరే అందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నది. రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రు లు చేస్తున్న వ్యాఖ్యలపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. వీటినుంచి తప్పించుకోవడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ దారులు వె దుక్కుంటున్నదని అందులో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. మరోవైపు రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్ల సీఎం అనుచరుల హంగామా జాతీయ స్థాయిలో మార్మోగుతున్నది. ఈ వ్యతిరేకత నుంచి ఇప్పటికిప్పుడు తప్పించుకోవడానికి సీఎం ఎంచుకున్న మార్గమే సినీనటు డు నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వేషన్‌ను కూల్చివేత అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
రుణ రణ జనగీతం
రుణమాఫీ విషయంలో రైతుల్లో ఆగ్ర హం పెల్లుబికుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలతోపా టు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ రైతులు నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలబడుతున్నది. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల మద్యం రాబోతున్నదని, బియ్యం కొనుగోలు టెండర్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం జరిగిందనే విషయం వెలుగులోకి రాగానే ప్రజల దృ ష్టిని మళ్లించేందుకు కేసీఆర్ సర్కార్ హ యాంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందంటూ లీక్ లిచ్చి, మీడియాలో డెయిలీ సీరియళ్లను మించిన కథనాలు వండివార్చారు. మరోవైపు, సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పా టు కోసం ఉద్దేశించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏ ర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ మేధో సమా జం సీఎం వ్యవహరిస్తున్న తీరుపై రాహుల్‌గాంధీకి లేఖ రాసింది. అమెరికా పర్యట నలో సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరుడి సం స్థతో రూ.1,000 కోట్ల ఒప్పందం దు మారం రేపింది. వీటి నుంచి దృష్టిని మ ళ్లించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు.
ఒకటా.. రెండా.. అసెంబ్లీ సాక్షిగా అనేకం!
రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ సాక్షిగా సర్కార్ వైఫల్యాలను ఎండగడితే, వాటిపై సమాధానం చెప్పాల్సిందిపోయి ‘ఆ ఇద్దరు అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండే’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి తీరును రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్లపై చర్చ జరిగిన సందర్భంలో ‘మోటర్లకు మీటర్లు పెడతామని కేసీఆర్ సర్కార్ సంతకాలు చేసింది’ అంటూ సభలో సమాధానాలు చెప్పకుండా అసత్యాలు ప్రచారం చేయడం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలోనూ సభను తప్పుదారి పట్టించి విమర్శల పాలు కావడం, బీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల అని లీకులు ఇచ్చింది. తీరా ఉద్యోగాల సంఖ్య లేకుండా ఇప్పటికే ప్రకటించిన పరీక్షల తేదీలను స్టేట్మెంట్ రూపంలో అసెంబ్లీలో వెల్లడించి ఉద్యోగార్థుల దృష్టిని దారిమళ్లించే ప్రయత్నం చేశా రు. ఇక రుణమాఫీ జన నిరసన గీతం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘ఎన్’ కన్వేషన్ కూల్చివేతను సీఎం తెరమీదికి తెచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.