రాజ్యసభకు దామన్న, పార్థసారథిరెడ్డి ఏకగ్రీవం
- సోమవారం అధికారిక ప్రకటన
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. గత నెల 25న టీఆర్ఎస్ అభ్యర్థులుగా వీరిద్దరూ దాఖలు చేసిన నామినేషన్లు సరైనవి అని బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తించారు. మరో ఇద్దరు అభ్యర్థులు శ్రమశక్తి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోరజ్ కోయల్కర్ దాఖలు చేసిన నామినేషన్లను ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రతిపాదించకపోవటంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఉన్న రెండు నామినేషన్లు దీవకొండ దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డివే కావటంతో వీరు ఏకగ్రీవం అయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అనంతరం ఎన్నికల సంఘం వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించి, ధ్రువపత్రాలను అందజేస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

