హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): జిల్లా జడ్జీల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2022 ఏడాదికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 13 జిల్లా జడ్జీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కే సుజన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంట్రీ లెవల్ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలకు హైకోర్టు అధికారిక వెబ్సైట్ tshc.gov.in.ను సంప్రదించాలని సూచించారు.