వెల్దండ : ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ ( BRS ) రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల యువ నాయకుడు జంగిలి ఆనంద్(Anand) కోరారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ (Silver Jublee Celebrations) సభ పోస్టర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సూచన మేరకు అన్ని గ్రామాలకు పోస్టర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. కేటీఆర్ పిలుపుమేరకు అన్ని గ్రామాల్లో పార్టీ దిమ్మెలు నిర్మించి బీఆర్ఎస్ జండాలు ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. గుండాల గ్రామంలో మండల నాయకుడు ఏకుల శ్రీను పార్టీ జెండా కోసం దిమ్మె కట్టించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే వెంకటయ్య, జంగిలి రవికుమార్, ఏకుల అంజయ్య, గోరటి సంజీవ్, బాలు నాయక్, సజ్జన్ నాయక్ ఉన్నారు.