హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): వానకాలం రైతుబంధు పంపిణీ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం కింద రూ.7,433 కోట్లు జమ చేసింది. 8వ విడత రైతుబంధు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న ప్రారంభించింది. మొదటి రోజు ఎకరంలోపు విస్తీర్ణం కలిగిన రైతులకు ఆర్థిక సాయం అందజేశారు. ఆ తర్వాత విడుతల వారీగా నిధులను జమచేశారు. ఈ నెల 20వ తేదీ నాటికి పంపిణీ మొత్తం పూర్తయిందని అధికారులు తెలిపారు.