హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రక్తహీనత, పోషకాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు స ర్కారు బడుల్లోని విద్యార్థులకు అందజేసే ఉచిత రాగిజావ పంపిణీ నిలిచిపోయింది. విద్యాసంవత్సరం ప్రారంభ మై నెల రోజులు గడుస్తున్నా బడుల్లో ఇంకా పంపిణీ ప్రారంభంకాలేదు. ఈ విషయంలో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కొంత కాలంగా సర్కారు బడుల్లోని విద్యార్థులకు వా రానికి మూడు రోజులు ఫోర్టిఫైడ్ రాగిజావను పంపిణీచేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ఇంకా రాగిజావ పంపిణీ ప్రారంభంకాలేదు.