ఇచ్చోడ, జూలై 23 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే)లో విద్యార్థులకు మాజీ సర్పంచ్ ల్యాప్టాప్లను అందజేశారు. గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులు ప్రవళిక, మాధవ్ ఉన్నత చదువుల కోసం ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మీనాక్షి గాడ్గే మాట్లాడుతూ..
కేటీఆర్ పుట్టిన రోజును పురసరించుకుని గ్రామంలో పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసినట్టు తెలిపారు. గ్రామంలో వారం రోజుల క్రితం 24 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేసినట్టు చెప్పారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో గ్రామంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ పాల్గొన్నారు.