నందిగామ, అక్టోబర్24: ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేగూరులో షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్.. ఓ వృద్ధురాలి చేతికి డబ్బులు ఇచ్చి ఓటు అభ్యర్థించారు. ఈ విషయమై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.