ములుగు రూరల్, నవంబర్17 : అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ చిన్నారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజూ 100 ఎంఎల్ పాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వద్ద మంత్రి సీతక్క ప్రారంభించారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏండ్ల వయసు కలిగిన చిన్నారులకు ఉచితంగా ప్రతి రోజూ పాలను అందించనున్నామని మంత్రి తెలిపారు.