సిద్దిపేట : కొమురవెల్లి మల్లన్న కల్యాణ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున దిష్టి కుంభం కార్యక్రమం ఘనంగా జరిగింది. వీరశైవ ఆగమ విధానంలో 200 కిలోల బియ్యాన్ని అన్నము వండి ఆలయ మహా మండపంలో రాశిగా పోసి దిష్టి కుంభం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో బాలాజీ, బార్శీ బృహన్మఠాధీశులు సిద్ధగురు మణికంఠ శివాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఆదివారం ఉదయం 10:45 గంటలకు కొమురవెల్లి మల్లన్న కల్యాణం జరగనుంది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జునుడు పెళ్లాడనున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్‌రావు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 7 గంటలకు కొమురవెల్లి మల్లన్న రథోత్సవం, రేపు ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు లక్షబిల్వార్చన, మహా మంగళహారతి నిర్వహించనున్నారు.