హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి నూతన హాజరు వ్యవస్థ అమల్లోకి రానున్నది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలుచేస్తామని సీఎస్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నది. అయితే ఈ విధానంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉద్యోగులతోనో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనో ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ హాజరు విధానంతో తమకు ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.