సిర్పూర్(యు), ఫిబ్రవరి 12 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం జాముల్ధర గ్రామ పంచాయతీ పరిధిలోని మోతిగూడలో బోరు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకోగా, కలెక్టర్ చొరవతో వివాదం సద్దుమణిగింది.
ఈ మేరకు కలెక్టర్ హరిత గురువారం మోతిగూడ చేరుకొని గ్రామస్తులుతో సమావేశమయ్యారు. అటవీ, రెవెన్యుశాఖలతో సంయుక్త సర్వే నిర్వహిస్తామని, సమస్య రాకుండా చూస్తామని చెప్పడంతో వారు శాంతించారు.