హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై 2019లో దాఖలైన ఎలక్షన్ పిటిషన్ (ఈపీ)ని హైకోర్టు కొట్టివేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన ఈపీపై విచారణ కొనసాగించాల్సిన అనవసరం లేదని పేర్కొంది.
కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాలంటూ 2019లో సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టీ శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్లో పలు వాస్తవాలను వివరించకుండా గోప్యంగా ఉంచారని పిటిషనర్ ఆరోపించారు. 2018లో జరిగిన ఎన్నికల కాలపరిమితి గడువు ముగిసిన కారణంగా ఎన్నికల పిటిషన్‌పై విచారణ కొనసాగింపు అవసరం లేదని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి వెలువరించిన తీర్పులో పేరొన్నారు.