నాగర్కర్నూల్, జూన్ 12 : నాగర్కర్నూల్ జిల్లాలోని ఎనిమిది మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో క్రమశిక్షణను పటిష్టపర్చడంలో భాగంగా జారీ చేసిన జీవో-14కు విరుద్ధంగా మూడు ప్రాజెక్టుల పరిధిలో దీర్ఘకాలికంగా విధులకు హాజరుకాకుండా ఉన్న వారిపై చర్యలు తీసుకున్నారు. సంబంధిత శాఖల అధికారుల నివేదికలు, విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలు జీ వెంకటమ్మ, ఎస్ అరుణ, జీ సుల్తానమ్మ, జే మహాలక్ష్మి, సీ పద్మావతి, నిరంజన్, కాశమ్మ, దర్జి బక్కమ్మను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.