హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి ఆయా హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంలోని పెద్దలతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న మూడు సొసైటీల్లోని సభ్యులను ఒకే గొడుగు కిందికి తీసుకొనిరావాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, ది హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ, దక్కన్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీల మధ్య సమన్వయం కోసం ఒక కో -ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటుచేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఒక్కో సొసైటీ నుంచి ముగ్గురు చొప్పున సమన్వయ కమిటీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నదని చెప్పారు.
సభ్యుల పేర్లు రిపిటేషన్ లేకుండా అన్ని సొసైటీలు, వీలైనంత త్వరగా జాబితాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో టీశాట్ సీఈవో బీ వేణుగోపాల్‌రెడ్డి, తెలంగాణ మ్యాగజైన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కే శ్రీనివాస్‌రావు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్అలీతోపాటు ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ తరఫున సూరజ్‌కుమార్, బందు శ్రీకాంత్, రాకేశ్‌రెడ్డి, అజయ్‌కుమార్, ది హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ నుంచి రవీంద్రబాబు, భూపాల్‌రెడ్డి, భీమగాని మహేశ్వర్, సునీత, దక్కన్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ నుంచి రామకృష్ణ, శ్రీనివాస్, విక్రంరెడ్డి పాల్గొన్నారు.