అంబర్‌పేట, అక్టోబర్ 28: హైదరాబాద్ నల్లకుంటలో శ్రీ శృంగేరి శంకరమఠం ఉత్తరాధికారి, జగద్గురువు, శ్రీవిధుశేఖర భారతీస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ధర్మ విజయయాత్రలో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన స్వామిజీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆయనను దర్శించుకుని, వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే తదితరులు కూడా భారతీస్వామిని దర్శించుకొని ఆశీర్వచనం తీసుకున్నారు.