ఆత్మప్రబోధానుసారం!
- సీఎం పిలుపుపై రాజకీయ వర్గాల్లో చర్చ
హైదరాబాద్ జూలై 2, (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని, యశ్వంత్ సిన్హాను గెలిపించాలని కేసీఆర్ పిలుపు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఆత్మప్రబోధానుసారం ఓటు’ కొత్తేమీ కాదు. అందుకు మాజీ రాష్ట్రపతి వీవీ గిరి ఉదంతమే నిదర్శనం. 1969లో రాష్ట్రపతిగా ఉన్న జాకీర్ హూస్సేన్ ఆకస్మికంగా మరణించడంతో నాడు ఉప రాష్ట్రపతిగా ఉన్న వీవీ గిరి తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు.
ఆ తర్వాత జరిగిన ఎన్నికలో గ్రూప్ తగాదాలతో కాంగ్రెస్ తన అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డిని ఎంపిక చేసింది. దీంతో వీవీ గిరి రాష్ట్రపతిగా పోటీలో దిగారు. ఆ సమయంలో సంజీవరెడ్డిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ఇష్టం లేని నాటి ప్రధాని ఇందిర.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో ఆయనకు మద్దతుగా విప్ జారీ చేయకపోగా.. ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహించిన సంజీవరెడ్డి వర్గం రెండో ప్రాధాన్య ఓటును వీవీ గిరికి కాకుండా జనసంఘ్, స్వతంత్ర పార్టీలు బలపరిచిన సీడీ దేశ్‌ముఖ్‌కు వేయాలని పిలుపునిచ్చింది.
చివరకు ఇందిర వర్గీయులు ఆత్మప్రబోధానుసారం ఓటు వేసి వీవీ గిరిని బలపర్చారు. వామపక్షాలు సైతం వీవీ గిరి వైపే మొగ్గు చూపాయి. ఫలితంగా నీలం సంజీవరెడ్డి ఓడిపోయి వీవీ గిరి గెలిచారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలన్న పిలుపు అడపా దడపా వినిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ సైతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలకాలని పిలుపు ఇవ్వడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

