ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 24 : ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. బుధవారం ఇం దిరమ్మ ఇండ్ల సామూహిక ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు కో లాటం, డప్పు కళాకారులను పిలిపించారు. మంత్రి పర్యటన కొనసాగుతున్నంతసేపు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో పటాకులు, రాకెట్లను కాల్చా రు. ఈ క్రమంలో పటాకులు ఒక్కసారిగా పేలడంతో నేలకొండపల్లి మండ లం బోదులబండకు చెందిన కళాకారిణి పొట్టపింజర శివాని, కానిస్టేబుల్ బాలుకు గాయాలు కావడంతో వారిని ఖమ్మంలోని ఓ దవాఖానకు తరలించారు. ఆరెంపుల పాఠశాలలో ఏర్పా టు చేసిన మంత్రి సభలో ఓ మహిళ సొమ్మసిలి పడిపోయింది. వెంటనే ఆమెను రూరల్ సీఐ పోలీస్ వాహనంలో ఖమ్మం దవాఖానకు తరలించారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిసింది.