హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేంద్ర రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన ప్రాజెక్టుల అంశం ప్రస్తావనకు రాలేదు. రైల్వే బడ్జెట్లో తెలంగాణలో కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి? కొనసాగుతున్న ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు.
తెలంగాణకు 2025-26 రైల్వే బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారన్న అంశం వెల్లడించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.