నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15: శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను ముట్టడించారు.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మాగనూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా యాచా రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు, వృద్ధులు బైఠాయించారు.