హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని హెచ్ఎంలు వృత్తికి పునరంకితమై పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సూచించారు. ‘పీఎం శ్రీ’ పాఠశాలలు దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ‘పీఎం శ్రీ’ స్కూళ్లపై ప్రధానోపాధ్యాయులకు బంజారాహిల్స్‌లోని సేవాలాల్ భవన్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, సైన్స్‌ల్యాబ్‌లు, గ్రంథాలయాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సందర్శనలు, సెల్ఫ్ డిఫెన్స్శిక్షణను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధారెడ్డి, జేడీలు పీ రాజీవ్, బీ వెంకటనర్సమ్మ పాల్గొన్నారు.