కంఠేశ్వర్, ఫిబ్రవరి 19 : నిజామాబాద్ మార్కెట్ యార్డులో డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్ (డీపీసీ) బుధవారం ప్రారంభమైంది. వ్యాపారులు, మార్కెటింగ్ అధికారులు, పాలకవర్గం కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని పసుపు రైతులు మంగళవారం ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. పసుపు కొనుగోళ్లు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా డైరెక్ట్ పర్చేసింగ్ సెంటర్ను ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను నిలదీసిన విషయం విదితమే. కర్షకుల ధర్నా నేపథ్యంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ హుటాహుటిన స్పందించింది. రైతులు పసుపు కొమ్ములను బాగా ఎండబెట్టి, చెత్తాచెదారం లేకుండా తీసుకొస్తే ఎలాంటి కమీషన్ లేకుండా నేరుగా రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతాయని మార్కెటింగ్ అధికారులు తెలిపారు.