హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని అన్ని ఉన్నత బడుల్లో డిజిటల్ పాఠాలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి వారం నుంచి పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన అమలుకానున్నది. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ విద్యకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా సర్కారు బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను బిగించాలని నిర్ణయించింది. ఇలా 13,983 ప్యానళ్లను బడులకు చేర్చారు. రాష్ట్రంలోని 8, 9, 10 తరగతుల్లోని విద్యార్థులకు డిజిటల్ విద్యను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2 వేల బడుల్లో డిజిటల్ తరగతులు నడుస్తున్నాయి. జనవరి మొదటి వారంలో మిగిలిన బడుల్లో డిజిటల్ క్లాసు రూంలు ప్రారంభించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకొన్నది. రాష్ట్రంలో 4,661 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లోని 8, 9, 10 తరగతుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన రానున్నది.
ఉపయోగాలు