కేసీఆర్ హయాంలోనే ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’
‘దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రాష్ట్రంలో ప్రజలందరికీ అమలు పరుస్తున్నాం. మానవ వనరుల సంక్షేమంలో భాగంగా ఆరోగ్య రక్షణ అత్యంత ప్రధానమైనది.
- 2022లోనే సిరిసిల్ల, ములుగులో పైలట్ ప్రాజెక్ట్
- తామే ప్రారంభించినట్టు చెప్పుకొంటున్న కాంగ్రెస్
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రాష్ట్రంలో ప్రజలందరికీ అమలు పరుస్తున్నాం. మానవ వనరుల సంక్షేమంలో భాగంగా ఆరోగ్య రక్షణ అత్యంత ప్రధానమైనది. అందుకోసం హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసి వారికి డిజిట ల్ హెల్త్ కార్డులు అందజేస్తాం.’ అని అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. కానీ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2022 మార్చి 5న డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించింది.
పౌరులందరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే ఈ పైలట్ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరిం చాలని నాడే ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ఎస్టోనియా దేశంలో చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రక్రియను ఆరోగ్యశాఖ అధికారులు నాడు అధ్యయనం చేశారు. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 197 బృందాలు రెండు జిల్లాల్లో పర్యటించి వివరాలు సేకరించాయి. రక్తపోటు, షుగర్, మూత్రం వంటి ఇతర పరీక్షల వివరాలను సేకరించింది. అదనపు వివరాలు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రానికి తీసుకెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుండ గానే రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో తాజా బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ తామే తీసుకొచ్చినట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనిని తామే కొత్తగా చేసినట్టుగా చెప్పుకోవడం కాంగ్రెస్‌కే చెల్లిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

