జోడో యాత్రలో తోపులాట
నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ నాయకులు సుభాష్‌రెడ్డి, మదన్మోహన్రావు వర్గీయులు పరస్పరం తోపులాడుకున్నారు.
- సుభాష్‌రెడ్డి, మదన్మోహన్ వర్గీయుల బాహాబాహీ
- కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ విభేదాలు
గాంధారి, మార్చి 19: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ నాయకులు సుభాష్‌రెడ్డి, మదన్మోహన్రావు వర్గీయులు పరస్పరం తోపులాడుకున్నారు. రేవంత్‌రెడ్డి చేపట్టిన జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా గాం ధారి మండలంలోని గుడిమెట్ గ్రామంలో శనివారం రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి బస చేసిన క్యాంపు వద్దకు చేరుకున్నారు.
రేవంత్‌రెడ్డిని కలవడానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి సుభాష్‌రెడ్డి తన అనుచరులతో వెళ్లారు. అదే సమయంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్మోహన్రావు కూడా తన వర్గీయులతో కలిసి రేవంత్‌రెడ్డిని కలవడానికి క్యాంపులోకి వెళ్తుండగా అక్కడి సిబ్బంది కేవలం మదన్మోహన్రావును మాత్రమే లోపలికి అనుమతించి ఆయన అనుచరులను క్యాంపు బయటే ఉంచారు. ఈ విషయమై మదన్మోహన్రావు వర్గీయులు.. అక్కడే ఉన్న సుభాష్‌రెడ్డి వర్గీయులతోపాటు రక్షణ సిబ్బందితో గొడవకు దిగారు. కావాలనే టీపీసీసీ అధ్యక్షుడిని కలవకుండా సుభాష్‌రెడ్డి తమను అడ్డుకున్నారని మదన్మోహన్రావు వర్గీయులు ఆరోపించారు. కాగా జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి ఆదివారం గాంధారి మండలం గుడిమెట్ నుంచి మం డల కేంద్రానికి చేరుకున్నారు. గ్రూప్-1 పరీక్ష పేపర్ల లీకేజీకి నిరసనగా శివాజీ చౌక్ వద్ద చేపట్టిన దీక్ష వెలవెలబోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

