వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల(Congress leaders) మధ్య తలెత్తిన విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై(Baswaraju Saraiah) మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి(Konda Murali) ఫైర్ అయ్యారు. నేను పార్టీ మారితే రాజీనామా చేసిన.. నీకు దమ్మ్మంటే రిజైన్ చేసి గెలువు అంటూ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యకు సవాల్ విసిరారు. పోచమ్మ మైదాన్ పోచమ్మ గుడి దారికి వెళ్లే డబ్బాలు అడ్డంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తొలగించారు.
దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డబ్బాలు తొలగించిన చిరు వ్యాపారులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు.
కానీ, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య లాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారలేదన్నారు. అలాగే ఒక బీసీ నాయకుడై ఉండి రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి డబ్బాలు ఎలా తొలగిస్తావని ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ నిప్పు ఉప్పులా వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలు గందరగోళంగా నెలకొంది. నేతల మధ్య విభేదాలు ఎటు దారి తీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు..
ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫైర్
నేను పార్టీ మారితే రాజీనామా చేసిన.. నీకు దమ్మ్మంటే రిజైన్ చేసి గెలువు అంటూ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యపై ఫైర్ అయిన కొండా మురళి
పోచమ్మ… pic.twitter.com/ms1uwewkZm
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2024