ధర్మారం, డిసెంబర్ 8 : వేడివేడి సాంబార్ పాత్రలో పడి చికిత్స పొందుతూ పుట్టిన రోజే ఓ బాలుడు మృత్యుఒడికి చేరిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ బాలికల గురుకులంలో జరిగింది. ధర్మారం ఎస్సై ప్రవీణ్ కుమార్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మొగిలి మధుకర్ ఏడాదిన్నర నుంచి మల్లాపూర్ బాలికల గురుకుల విద్యాలయంలో తాతాలిక పద్ధతిన వంటపని చేస్తున్నాడు. భార్య శారద, కూతురు శ్రీమహి, కొడుకు మోక్షిత్ (4)తో కలిసి విద్యాలయంలోని క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. మధుకర్ రోజూవారీలాగే ఆదివారం గురుకుల విద్యాలయ వంటగదిలో సాంబారు వండి పకన పెట్టాడు.
ఈ క్రమంలో అతడి కొడుకు మోక్షిత్ ఆడుకుంటూ వెళ్లి వేడిగా ఉన్న సాంబారులో పడి తీవ్రంగా గాయపడ్డాడు. మధుకర్ వెంటనే గమనించి కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించాడు. అకడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేరొన్నారు. మోక్షిత్ పుట్టిన రోజునే మృతిచెందడంతో కుటుంబం కన్నీరుమున్నీరైంది.