హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు(Gurukul employees) మంగళవారం ప్రజాభవన్(Praja Bhavan) లోపల ధర్నా(Dharna) చేపట్టారు. ప్రజాభవన్‌కు భారీగా చేరుకున్న గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగులు ప్రమోషన్లు( Promotions), బదిలీలు(transfers) చేపట్టిన తరువాతే గురుకుల పోస్టుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
జేఏసీ డిమాండ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదరాబాదరాగా గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్స్‌కు దిగిరాకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ ఈ సందర్భంగా హెచ్చరించింది. ఈ కాక్రమంలో టిగారియా సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మామిడి నారాయణ, స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.