సదాశివపేట, ఆగస్టు 8: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్, సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపూర్ శివారులో అధికారులు డిజిటల్ భూ సర్వే నిర్వహించారు. సర్వేకు ఎలాంటి అడ్డంకులు జరగకుండా ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్డు వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి భూసర్వే చేయాలని డిమాండ్ చేశారు. తాతల కాలం నుంచి వస్తున్న భూములను కోల్పోతే తమకు జీవనోపాధి లేకుండా పోతుందని, భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతరం పెద్దాపూర్ వద్ద జాతీయ రహదారి 65పై ధర్నా నిర్వహించారు.
నాకు అద్దెరక భూ మి ఉన్నది. భూమి ఇస్తే నేనెట్ల బతుకు డు. రోడ్డుకు భూమియ్యా. అందరిస్తే నేని స్తా. భూమికి భూమి ఇవ్వాలి. లేదంటే బయట ఉన్న రేటు కట్టియ్యాలి. గట్లయితేనే ఇస్తా. లేదంటే ఇయ్యా.