హైదరాబాద్ : సమస్యల పరిష్కారం కోసం మేడారం(Medaram) పూజారులు(Priests dharna) ఆందోళనబాట పట్టారు. ములుగు జిల్లా సమ్మక్క సారక్క9 Sammakka- Saralamma) తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మక్క సారలమ్మల ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. మేడారం జాతర కార్యాలయ పరిధిలో శాశ్వత పోస్టులను మంజూరు చేయాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పూజారులు వేద పాఠశాల నిర్వహణను వెంటనే రద్దు చేయాలన్నారు. జాతర సమయంలో ఆదివాసిలకే లిక్కర్, కొబ్బరికాయలు, బెల్లం షాపులు ఇవ్వడానికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. అలాగే అపరిష్కృతంగా నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.