
ఎల్బీనగర్, డిసెంబర్ 18: జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకోవాలన్న మోదీ సర్కారు నిర్ణయంపై ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్ఐసీ ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వ్యతిరేకంగా శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లోని జీవిత బీమా సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, కరపత్రాలను పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో హైదరాబాద్ ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య, ఉపాధ్యక్షురాలు ఎం విజయల క్ష్మి, సంయుక్త కార్యదర్శులు మద్దిలేటి, డీ గిరిధర్, మ హిళా సబ్‌కమిటీ కన్వీనర్ వీ మైథిలి పాల్గొన్నారు.