Dharmapuri Arvind | ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 7 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ‘ఎక్స్’లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచరుల ఖాతాలను సదరు సోషల్ మీడియా సంస్థ రద్దు చేసింది. నియమ నిబంధనలు పాటించక పోవడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. కవితను రాజకీయంగా ఎదుర్కోలేని అర్వింద్ తన అనుచరులతో సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా ఖాతాలను ‘ఎక్స్’ నిలిపివేయడంపై బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఈ చర్య ఎంపీ అర్వింద్‌కు చెంపపెట్టు అని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.