హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ధరణి పునర్నిర్మాణ కమిటీ గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఇప్పటివరకు గుర్తించిన అంశాలను సీఎం కు వివరించినట్టు తెలిసింది. ఈ నెల 24న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా వారు ఇచ్చే సమాచారం ఆధారంగా ఒక ప్రాథమిక నివేదిక రూపొందిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో శనివారం కలెక్టర్ల సమావేశం అనంతరం ఈ అంశంపై సమగ్రంగా చర్చిద్దామని ధరణి కమిటీకి సీఎం సూచించినట్టు తెలిసింది.