కొత్తగూడెం అర్బన్, జనవరి 14 : రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కర్ వ్యాఖ్యానించడం అధ్యక్ష తరహా పాలనకు సంకేతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవి చేపట్టిన ధన్కర్ అదే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. శనివారం ఆయన కొత్తగూగూడెంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తే రాజ్యాంగ మౌలిక స్వరూపాయాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు పూనుకోవడం దారుణమని, అంతిమంగా రాష్ట్రపతి పాలనకు, అధ్యక్ష తరహా పాలనకు దారితీసే పరిస్థితులకు ధన్కర్ తెరలేపారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభకు కమ్యూనిస్టు పార్టీలకు ఆహ్వానం అందిందని, ఈ సభకు జాతీయ నాయకత్వం హాజరవుతుందని ఆయన చెప్పారు.