నందికొండ, అక్టోబర్ 14: సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి బౌద్ధధర్మమే శరణ్యమని ప్రముఖ ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న పేర్కొన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధమ్మ దీక్షా దివస్ ఉత్సవాలను బుద్ధవనంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు.
బుద్ధచరిత వనంలోని బుద్ధుడి పాదాలకు బౌద్ధ భిక్షువులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడి బోధనలు మార్గదర్శనం చేశాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ హేతువాద రచయిత డాక్టర్ దేవరాజు, ఆచార్యులు డాక్టర్ సంతోష్రౌత్, బిషప్ జాన్ గొల్లపల్లి, బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పాల్గొన్నారు.