హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అసాధారణ పనితీరును కనబరిచిన సైబర్ వారియర్లను డీజీపీ శివధర్‌రెడ్డి సోమవారం సన్మానించారు. వీరిలో పిటిషన్ల పరిషారం, రిఫండ్ ఆదేశాలు, అవగాహన కార్యక్రమాలు, సైబర్ క్రైమ్ దర్యాప్తు, డాటా విశ్లేషణ, ఆపరేషన్స్ టీమ్ తదితర విభాగాలకు చెందినవారు ఉన్నారు. సైబర్ నేరాల కట్టడికి వేగం, సాంకేతిక నైపుణ్యం, సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రోడ్లు అధ్వానంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని,చట్టబద్ధమైన ప్రమాణాల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా రోడ్లు బాగాలేవని పేరొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పోలీసుశాఖతోపాటు జీహెచ్ఎంసీని చేర్చారు. అయితే రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుపై త్వరలోవిచారణ ప్రారంభం కానున్నది.