హైదరాబాద్, డిసెంబరు 11 (నమస్తే తెలంగాణ) : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బీ శివధర్‌రెడ్డి గురువారం ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్‌ను డీజీపీ వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ తీరును పర్యవేక్షించారు. తన కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీజీపీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్, కౌంటిం గ్ ఏర్పాట్లను పరిశీలించారు. లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ ఎం భగవత్, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్‌తో కలిసి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నికల కమిషన్ 3,000కు పైగా గ్రామ పంచాయతీల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.