36 ఏండ్ల సర్వీసు సంతృప్తి ఇచ్చింది : డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడి
తన 36 ఏండ్ల సర్వీసు ఎంతో సంతృప్తి ఇచ్చిందని, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తూ సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్న ఆయన పోలీసు శాఖలో అందించిన సేవలను వివరించారు
- సీఎం కేసీఆర్ సహకారం గొప్పది
- శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం
- పోలీసు శాఖలో సంస్కరణలు
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తన 36 ఏండ్ల సర్వీసు ఎంతో సంతృప్తి ఇచ్చిందని, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తూ సహకరిస్తున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్న ఆయన పోలీసు శాఖలో అందించిన సేవలను వివరించారు. తారతమ్యాలు లేకుండా అందరికీ సమన్యాయం అందించేందుకు కృషి చేశానని, శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేశానని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు సమయంలో మావోయిస్టు సమస్య అధికమవుతుందని అందరూ అన్నారని, నేడు నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, సంస్కరణల ద్వారా తెలంగాణ పోలీస్‌ను దేశంలోనే మేటిగా తయారు చేశామని అన్నారు. తొలి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆయన సూచనలతో ఇతర దేశాల్లోని పోలీస్ వ్యవస్థపై అధ్యయనం చేసి వచ్చామని చెప్పారు. అత్యాధునిక విధానాలను ఇక్కడ అమలు చేయడం ద్వారా నేరం చేసిన వారు తప్పకుండా పట్టుబడతామనే భావన కలిగేలా చేశామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ చొరవతో పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని, ఇవ్వాళ సామాన్యులు ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే వాతావరణం కల్పించినట్టు వివరించారు. ఓ వైపు ప్రజలకు చక్కటి శాంతిభద్రతలు అందిస్తూనే పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకొన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం గడిచిన 8 ఏండ్లలో చెప్పుకోదగ్గ శాంతిభద్రతల సమస్య ఏర్పడలేదని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

