హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : ప్రజాసేవపై పోలీసులు మక్కువ పెంచుకోవాలని డీజీపీ జితేందర్ ట్రైనీ కానిస్టేబుళ్లకు హితబోధ చేశారు. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో ట్రైనీ కానిస్టేబుళ్లతో డీజీపీ సమావేశమై మాట్లాడారు. క్రమశిక్షణతో ఉంటేనే మంచి పోలీసులుగా రాణించగలరని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, నర్మద, సునీతామోహన్, అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి కన్ఫర్డ్ ఐపీఎస్లుగా ఎంపికైన ఆరుగురు అధికారులు బుధవారం డీజీపీ జితేందర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. డీజీపీ జితేందర్ను కలిసిన వారిలో కొత్త ఐపీఎస్లు కే నరసింహ, బీ రాంరెడ్డి, ఏ భాస్కర్, ఎస్ చైతన్యకుమార్, సీహెచ్ శ్రీధర్, కే శిల్పవల్లి ఉన్నారు.