హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపారు.
బదిలీ అయిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ ఆదేశించారు.