హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ):వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ఐజీ చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడి గోదావరి వరద పరిస్థితిని సమీక్షించారు.