హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం పోలీసు సంక్షేమంలో కీలక భాగమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన లేకుండా చేస్తే పోలీసులు విధులపై మరింత దృష్టి సారించగలరని పేరొన్నారు. మంచిరేవులలోని ఆక్టోపస్-గ్రేహౌండ్స్ ప్రాంగణంలో యంగ్ ఇండియా పోలీస్ సూల్ (వైఐపీఎస్) అకడమిక్ బ్లాక్-1 నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్మీ, సైనిక్ సూళ్ల తరహాలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో వైఐపీఎస్ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. నిరుడు ఏప్రిల్లో తాతాలిక ప్రాంగణంలో 120మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభమైందని, ప్రస్తుతం 360కు చేరిందని అన్నారు. కొత్త భవనం పూర్తయితే 700-720 మందికి చేరే అవకాశం ఉన్నదని తెలిపారు.