హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ శాఖలో పలువురు డీఎస్పీ/ఏసీపీ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మొత్తం 17 మంది డీఎస్పీల్లో వెయిటింగ్లో ఉన్న 14 మందికి కొత్తచోట పోస్టింగ్లు వచ్చాయి. మిగిలిన ముగ్గురికి బదిలీ ఆదేశాలు వచ్చాయి.
పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని, బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు పొందిన అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.