హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కి అగ్నిమాపకశాఖలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు(ఎస్ఎఫ్వోలు) బదిలీ అయ్యారు. ఈ మేరకు అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో రిపోర్టుచేయాలని ఆదేశించారు. హన్మకొండ ఎస్ఎఫ్వో చంద్రశేఖర్‌రెడ్డి, కోదాడ ఎస్ఎఫ్వో సీహెచ్ శ్రీనివాస్, సికింద్రాబాద్ ఎస్ఎఫ్వో సుభాష్‌రెడ్డి, ముషీరాబాద్ ఎస్ఎఫ్వో బీ సుధాకర్, గౌలిగూడ ఎస్ఎఫ్వో ఎన్ ప్రవీణ్‌కుమార్, లంగర్‌హౌస్ ఎస్ఎఫ్వో పీ దత్తు, వనపర్తి ఎస్ఎఫ్వో ఎస్ పద్మయ్య బదిలీ అయిన వారిలో ఉన్నారు.