సూర్యాపేట, ఫిబ్రవరి 18(నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర మూడో రోజూ జన సంద్రంగా కనిపించింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 5 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. యాదవ పూజారులు గుడి ముందు చంద్రపట్నం వేసి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనమెత్తుకుని మెట్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు. చౌడమ్మకు బోనం సమర్పించి, లింగమంతుల స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్ కుమార్, చంద్రవతి, జడ్పీ మాజీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూదిమెట్ల బాలరాజుయాదవ్, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.