Nagoba Jatara | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబ జాతరకు గురువారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గిరిజనులు నాగోబాను దర్శించుకున్నారు. మిశ్రమం వంశానికి చెందిన గిరిజనులు పెద్దదేవునికీ, మహిళలు బాన్ దేవత పూజలు నిర్వహించారు. జాతర ప్రారంభమైన రెండో రోజు భారీగా భక్తులు తరలిరావడంతో అధికారులు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జరిగే గిరిజన దర్బార్ కు రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.