Medaram Jathara | ములుగు, జనవరి17 (నమస్తే తెలంగాణ) : ‘మేడారంలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. రేవంత్‌రెడ్డీ మళ్లీ ఇగరావు.. కేసీఆర్ విలువ ఇప్పుడు అందరికీ తెలస్తున్నది’ అంటూ సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు శనివారం సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్ అయింది. ‘అమ్మవార్ల దర్శనానికి వస్తే ఆరు కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేసి దుబ్బరోడ్ల నుంచి పంపించారు. ట్రాఫిక్ వ్యవస్థ చెత్త.. ముందు వెహికిల్ ఉంటే దుబ్బ కారణంగా వెనకాల ఉన్న వెహికిల్‌కు కనిపించడంలేదు. ఏదో బ్రహ్మాండం చేశామని, బద్దలు కొట్టామని అన్నారు.
అంత సిని మా ఇక్కడ లేదు. ఈ సారి జాతర అట్టర్ ఫ్లాప్.. ఏదో అని చెప్పి శిల్పాలు, గోడలు చూపించారు. భక్తులకు సేఫ్టీ లేదు. దర్శనంలో తొక్కిసలాట.. నా భార్య అందులో ఇరుక్కుపోయింది. చిన్న పిల్లలతోపాటు 16 మందితో వస్తే తలో జాగకు పోయా రు. పరిస్థితి కరెక్టుగాలేదు. చెప్పుకోడానికే తప్ప ఇక్కడ ఏమీలేదు. సీతక్క టీవీ ఇంటర్వ్యూలు భలే ఇస్తున్నావు కదా.. వచ్చి మా లెక్క లైన్ లో నిలబడి దర్శనం చేసుకొనిపో… గుర్‌గుర్ అని సౌండ్ పెట్టుకొని వచ్చుడు కాదు.. దుబ్బలకెళ్లి ఒకసారి రా.. మమ్ములందరినీ దుబ్బలకెళ్లి నడిపించి నువ్వు.. మెయిన్ రోడ్డులెక్కి వస్తున్నావు కదా.. దుబ్బలకెల్లి రా సీతక్కా.. నీకు తెలుస్తుం ది..
టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి బ్రహ్మాండం బద్దలు కొట్టినం.. ఈ సారి మాదే అంటున్నావు కదా.. ఈ ఒక్క విషయంలో నువ్వు ఓడిపోతావు రేవంత్‌రెడ్డీ.. ఇగ నువ్వు రా వు.. కేసీఆర్ విలువ అందరికీ తెలుస్తున్న ది. ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుం దాం.. నేను ఈ రీల్‌ను ఇన్‌స్టాలో పోస్టు చే స్తా.. షేర్ చేయండి.. చూద్దాం వ్యవస్థ ఎ లా ఉంటుందో’ అని మేడారం భక్తుడు తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా తల్లుల సన్నిధి నుంచి పోస్టు చేశాడు. దర్శనానికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు, దర్శనాలు, ట్రాఫిక్ సమస్యను అధికారులు పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.