హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో స్థానికత (లోకల్, నాన్నోకల్) అంశంపై మళ్లీ అలజడులు చెలరేగేలా ఉన్నాయి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మరో ములీ ఉద్యమం తప్పదు’ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత జీ దేవీప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ నేత భుజంగరావు, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యురాలు ఉపేంద్రాచారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పల్లా నిషాంత్ కేసు తీర్పు వల్ల తెలంగాణ నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఒక వ్యక్తి తెలంగాణలో మూడేండ్లు బీటెక్ చదివితే స్థానికుడు ఎలా అవుతాడు? ఈ లెకన ఇతర రాష్ట్రాల వారు ఇకడ బీటెక్ పూర్తిచేస్తే వారందరినీ స్థానికులుగానే భావించాల్సి వస్తుందా? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పును తాము తప్పుబట్టడం లేదని, సరైన వాదనలు వినిపించడంలో టీజీపీఎస్సీ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దకేలా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొన్నారని, ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇకడ చదువుకున్న వారినే స్థానికులుగా గుర్తించేలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నారని గుర్తుచేశారు. తెలంగా ణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివితే అకడ స్థానికులుగా గుర్తించడం లేదనే విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ అధికారులు న్యాయపోరాటం చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సభపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొన్నారని, కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారని బీఆర్ఎస్ నేత భుజంగరావు విమర్శించారు. సభలో పీఆర్సీ గురించి అసలు చర్చే రాలేదని, ఆరు పెండింగ్ డీఏలలో ఒకటి, రెండు ఇస్తారని ఆశించినా తీరా నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు గురించి సీఎం మాట కూడా ఎత్తలేదని విమర్శించారు.