వెంటనే క్షమాపణ చెప్పాలి.. కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్
తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ) : తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా పీఆర్సీ అమలుచేయలేదని, పెండింగ్ డీఏలు ఇవ్వకుండా రిటైర్డ్ ఉద్యోగులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలలను కుదించడం, ప్రశ్నించే వారిని అణచివేయడం సరికాదని, సీఎం వెంటనే తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిది హిట్లర్ భాష
- రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ) : ‘ఇంజినీర్లు నీలా క్రిమినల్స్ కాదు, దేశానికి క్రియేటర్స్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిట్లర్ లాంటి అహంకారపూరిత వైఖరి వీడి, వారికి వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

వారిని క్రిమినల్ వేస్ట్ అనడం సీఎం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో డ్రగ్స్ బానిసలని, రిటైర్డ్ ఇంజినీర్లను జైల్లో పెడ్తానని బెదిరించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు విద్యార్థులను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

