రాయపర్తి, జూలై 10: వరంగల్ జిల్లా రా యపర్తి మండలం బుర్హాన్‌పల్లి తాజా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్‌రావు హత్య ము మ్మాటికీ రాజకీయ హత్యేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన బుర్హాన్పల్లికి వెళ్లి దేవేందర్‌రావు మృతదేహాంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుడి కుటు ంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పదేండ్ల కేసీఆర్ ప్ర భుత్వ పాలనలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలుగలేదని గు ర్తుచేశారు.
కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన ఆర్నెళ్లలోనే హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపీడీలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని మండిపడ్డారు. సర్పంచ్‌గా దేవేందర్‌రావు గ్రామ సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయనది ముమ్మాటికీ రాజకీ య హత్యేనని, నిందితులను గుర్తించి కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీ ఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హె చ్చరించారు. అనంతరం వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అం బటి నర్సయ్య, సీఐ జీడీ సూర్యప్రకాశ్‌తో ఫో న్లో మాట్లాడి కేసును ఛేదించాలని కోరారు. బుధవారం దేవేందర్‌రావు అలియాస్ బోరుబండి దేవన్న అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై సందీప్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉద్యమకాలాన్ని గుర్తుచేస్తున్నారు ;మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగార్థుల కార్యక్రమాల కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను మాజీ ఎమ్మెల్యే, టీయూడబ్ల్యూజే నాయకులు చంటి క్రాంతికిరణ్ ఖండించారు. జర్నలిస్టులపై ఓయూలో జరిగిన ఘటన ఉద్యమకాలం నాటి సన్నివేశాన్ని గుర్తుచేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను, జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకొని అణచివేత పాలనకు శ్రీకారం చుట్టిందనే అభిప్రాయాలు కలుగుతున్నాయని ఆరోపించారు. ఉద్యమకారులు, జర్నలిస్టులపై పోలీసుల దాడులను ఆపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.